Share News

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:20 AM

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి వి గంగాధర్‌ తెలిపారు. డీఐఈవో కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 23: జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి వి గంగాధర్‌ తెలిపారు. డీఐఈవో కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలోని 36,426 మంది విద్యార్థులకు 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష జరిగే రోజు ప్రశ్నాపత్రాల సీల్‌ ఓపెన్‌ చేయడాన్ని హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఉన్నతాధికారులు పరిశీలిస్తారని తెలిపారు. ఉదయం 8.15 నిమిషాల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామని, సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలను రాయాలని సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9.05 తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతించబోమని చెప్పారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈసారి విద్యార్థుల సంఖ్య పెరుగడంతో జిల్లాలో 57 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిందన్నారు.

ఫ క్యూఆర్‌ కోడ్‌తో పరీక్షా కేంద్రం గుర్తింపు

అభ్యర్థుల హాల్‌ టికెట్లపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన వెంటనే పరీక్షా కేంద్రం వివరాలు, చిరునామా, ఎలా వెళ్లవచ్చనే సమాచారం తెలుస్తుందని డీఐఈవో వి గంగాధర్‌సూచించారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని, పనివేళల్లో 0878-2933006 నంబర్‌కు ఫోన్‌ చేస్తే సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. హాల్‌ టికెట్లను విద్యార్థులు ఆన్‌లైన్‌లో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షకు హాజరుకావచ్చని, దానిపై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని తెలిపారు.

ఫ విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ నియమించిన టెలీ మానస్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని డీఐఈవో తెలిపారు. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడితో బాధపడే విదార్థులు టోల్‌ఫ్రీ నంబర్లు 14416, 1800-914416కు ఫోన్‌ చేస్తే సైకాలజిస్టులు సలహాలు, సూచనలిస్తారన్నారు. హాల్‌ టికెట్లలో ఏమైనా తప్పులుంటే డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు నేరుగా ్టటఛజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో పరీక్షల కమిటీ సభ్యులు వి సత్యవర్థన్‌రావు, ఎ సత్యనారాంజనేయ, అస్మాజబీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:20 AM