Share News

నియోజకవర్గ స్థాయి సభలకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 02 , 2026 | 12:30 AM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవ ర్గ స్థాయిలో శనివారం జరిగే సభలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ ఆదేశించారు.

నియోజకవర్గ స్థాయి సభలకు ఏర్పాట్లు

సిరిసిల్ల అర్బన్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవ ర్గ స్థాయిలో శనివారం జరిగే సభలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం శనివారం నియోజకవర్గ స్థాయి సభల నిర్వహణపై అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సభలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారు ల వివరాలతో కరపత్రం రూపొందించాలని, వా టిని ఈ కార్యక్రమంలో ప్రజలకు అందజేయాల ని కోరారు. మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువ త, రైతులు,వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వా నించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను పక డ్బందీగా చేయాలన్నారు. సభల్లో రాష్ట్ర గీతం (జయ జయహే తెలంగాణ) స్వాగతోపన్యాసం, పరిచయం అలాగే సీఎం సందేశం వినిపించాల ని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ 500 సబ్సిడీ గ్యాస్‌సిలిండర్‌, గృహజ్యోతి 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, సన్నరకం వరి ధాన్యానికి రూ500 బోనస్‌, చేయూత పెన్షన్లు, కల్యాణల క్ష్మి, షాదీముబారక్‌, ఇందిరా మహిళా శక్తిబ్యాంక్‌ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల వివరాలు, సాధిం చిన విజయాలపై శాఖల ద్వారా సమాచారం ఇవ్వాలని, లబ్ధిదారుల పేర్లను చదవాలని, లబ్ధి దారుల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పాలని తెలిపారు. ఇప్పటిదాకా అమలుచేస్తున్న వాటిపై చర్చించాలని, భవిష్యత్‌లో చేపట్టనున్న పనుల పై తీర్మానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ పీడీ వెంకట మాధవ రావు, డీఆర్డీవో గీత, సీపీవో శ్రీనివా సాచారి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దిన్‌, జిల్లా సం క్షేమాధికారి లక్ష్మీరాజం, మున్సి పల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:30 AM