Share News

మున్సిపల్‌ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు..

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:21 AM

జిల్లా పరిధిలో ఈనెల 11న నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ఆదేశించారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు..

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిధిలో ఈనెల 11న నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో గు రువారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైద రాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిష నర్‌ రాణి కుముదిని మున్సిపల్‌ ఎన్నికల ఏ ర్పాట్లపై ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధి కారి గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గీతే లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని మాట్లాడారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఉండాలని, పోలింగ్‌ కేంద్రం బయట కూడా సీసీ కెమెరా ఉండేలా చూడాలని ఆదే శించారు. పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ పేపర్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌, ఇత ర సామగ్రి ఏర్పాట్లపై సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, పోలింగ్‌, కౌంటింగ్‌ కేం ద్రాల ఏర్పాటుపై ఆడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న గెలుపొందిన వార్డు కౌన్సిలర్‌లతో ముందుగా ప్రమాణ స్వీకారం చేయించాలని వివరించారు. ఫారం 1, 2 ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు తది తర అంశాలపై వివరించారు. అనంతరం ఇన్‌ డైరెక్ట్‌ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నిబంధనల ప్రకారం గెజిటెడ్‌ అధికారు ల సమక్షంలో నిర్వహించాలని ఆదేశించారు. కోరం లేక వాయిదా పడితే 17వ తేదీన నిర్వ హించాలని తెలిపారు. ఎన్నికలు ముగిసే వర కూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉం టుందని స్పష్టం చేశారు.

67 వార్డుల్లో ఎన్నికలు

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో మొత్తం 67 వార్డులు ఉన్నాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రింటింగ్‌ పూర్తి అయిందని, మిగతా బ్యాలెట్‌పేపర్‌ సిద్దం అవుతున్నాయని వివరించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది సెకండ్‌ ర్యాండమైజేషన్‌ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తిచేశామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌,సిరిసిల్ల, వేము లవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు,రాధా బాయి, మున్సిపల్‌ కమిషనర్లు ఖ దీర్‌ పాషా, సంపత్‌ కుమార్‌. ఎన్ని కల అధికారి ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:21 AM