Share News

చేయూత పెన్షన్‌ దరఖాస్తులు స్వీకరించాలి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:24 AM

చేయూత పెన్షన్‌ దరఖాస్తులు స్వీక రించి ఆన్‌లైన్‌ చేయాలని, ఈనెల 31వ తేదీ తుది గడువు క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

చేయూత పెన్షన్‌ దరఖాస్తులు స్వీకరించాలి

సిరిసిల్ల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : చేయూత పెన్షన్‌ దరఖాస్తులు స్వీక రించి ఆన్‌లైన్‌ చేయాలని, ఈనెల 31వ తేదీ తుది గడువు క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణ, ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లాలోని ఎంపీడీవోలు, వ్యవసా య అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చేయూత పెన్షన్ల ప్రక్రియ, దరఖాస్తుల గడువుకు సంబంధించి దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని, ఈనెల 31వ తేదీ పెన్షన్‌ దరఖాస్తులు సమర్పించేందుకు తుది గడువని అన్నారు. మున్సిపాలిటీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయించామన్నారు. ఏడు రకాలకు సంబంధించిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమి యా, సికిల్‌ సెల్‌, హిమోఫీలియా గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరి యా, డయాలసిస్‌ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, వారు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. దరఖాస్తుకు ఆధార్‌ కార్డ్‌, వయస్సు ధ్రువీకరణ కోసం ఓటర్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, విద్యాభ్యాసం ధ్రువీకరణ పత్రం రేషన్‌ కార్డ్‌, తహసీల్దార్‌ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ ఉండేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు.

ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునేలా..

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో రూ 5 లక్షలలోపు తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మండలాల్లో నమూనా గృహాలు నిర్మించామని, చందుర్తి మండ లం కట్టలింగంపేటలో రూ.5 లక్షల లోపు నిర్మించిన ఇళ్ల గురించి వివరించి, గృహ నిర్మాణంలో అనవసర ఖర్చులు లేకుండా, నాణ్యతతో నిర్మాణాలు చేపట్టేలా, పేద కుటుంబాలకు భారంగా మారకుండా తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలి పారు. ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ నిర్మాణాల్లో వేగాన్ని పెంచాలని ఆదేశించారు. రెండో దశ మంజూరుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అనంతరం అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా ల లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

జలసిరి పనులు చేపట్టాలి

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఫాంపాండ్స్‌, బోర్‌వెల్‌ రీచార్జ్‌పనులు, సామాజిక ఇంకుడు గుంతలు తదితర నీటి సంరక్షణ పనులను ప్రణాళికా బద్ధంగా, యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీటిని సాధ్య మైనంత మేరకు ఒడిసిపట్టేలా గ్రామాల వారీగా అవసరమైన పనులను గుర్తించి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.ప్రతి మండ లంలో వ్యవసాయ అధికారులు రైతులకు జలసిరి పనులపై అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు తమ పొలాల్లో అవసరమైన ఫాంపాండ్స్‌, బోర్‌వెల్‌ రీచార్జ్‌ తదితర నీటి సంరక్షణ పనులను ఈజీఎస్‌ ద్వారా చేపట్టు కోవచ్చనే విషయాన్ని రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. నీటి సంరక్షణకు సంబంధించిన పనులను రైతులు సద్వినియోగం చేసుకు నేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

లాభదాయకమైన పంటలు పండించేలా..

రైతులకు లాభదాయకమైన పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పిం చాలని ఆదేశించారు. మండలాల వారీగా పంటల సాగు పరిస్థితులు, ప్ర త్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కూరగాయలు, పప్పుధాన్యాలు, ఆయిల్‌పామ్‌, నువ్వులు, వేరుశనగ, తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ జలాల పరిస్థితిని రైతు లకు వివరించాలని అన్నారు.ఎల్‌నినో ప్రభావం, పంట మార్పిడి, నీటి సంర క్షణ చర్యలు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై రూపొందించిన పోస్టర్లను అన్ని గ్రామాల్లో పంపిణీ చేసి, ప్రజల కు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొబేషన రీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జడ్పీ సీఈవో, పీడీ హౌసింగ్‌ వెంకటమాధవ రావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్‌ బేగం, హార్టికల్చర్‌ అధికారి శరత్‌, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, లోకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:24 AM