ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:27 PM
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు.
సుభాష్‌నగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఇటీవల రైతు వ్యతిరేక విత్తన, విద్యుత్ చట్టాలు తీసుకు వచ్చి బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే విధంగా చట్టం రూపొందించారన్నారు. రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసే కుట్రలు చేస్తుందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకు వచ్చిందన్నారు. ఉపాధి హామి పథకాన్ని రద్దు చేసి వీబీ జీ రాంజీ చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చారన్నారు. ఇది ముమ్మాటికి వ్యవసాయ కూలీల కడుపుకొట్టే చట్టమన్నారు. జిల్లా కేంద్రంలో డంపుయార్డు సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వర్ణ వెంకట్‌రెడ్డి, గుడికందుల సత్యం, శ్రీనివాస్, జి రాజేశం, ఎడ్ల రమేష్, డి నరేష్‌పటేల్, కొప్పుల శంకర్, గుండేటి వాసుదేవ్, వడ్ల రాజు, గజ్జల శ్రీకాంత్ పాల్గొన్నారు.