Share News

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మరో మణిహారం

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:47 AM

సిరిసిల్ల నేతన్నల ఖ్యాతికి అద్దం పట్టే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్‌ను రూ.3.60 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మరో మణిహారం

సిరిసిల్ల, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల నేతన్నల ఖ్యాతికి అద్దం పట్టే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్‌ను రూ.3.60 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. నేతన్నల కలకు అద్దం పట్టే విధంగా ప్రతిమలను ఏర్పాటుచేసి నీరాజనం పలికారు. వస్త్రపరిశ్రమ ఖ్యాతిని దశ దిశలుగా చాటేలా ఏర్పాటుచేసిన జంక్షన్‌, నేతన్నల ప్రతిమలను గురువా రం వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవా ణా, బీసీ వెల్ఫేర్‌ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభిస్తారు. ఇదే క్రమంలో జంక్షన్‌ వద్ద 12.50 లక్షలతో ఏర్పాటు చేసిన మోడల్‌ బస్‌ షెల్ట ర్‌ను ప్రారంభిస్తారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ నగేష్‌, డీఎస్‌పీ నాగేంద్ర చారిలు పరిశీలించారు.

రూ.3.60 కోట్లతో జంక్షన్‌ అభివృద్ధి

సిరిసిల్ల నేతన్నలు చేనేత నుంచి మరమగ్గాల వైపు అడుగులు వేస్తూ పట్టుచీరల నుంచి పంచెల వరకు అందిస్తున్న వారి వెనక ఏన్నో పస్తుల బాధలు ఉన్న తమ కళా నైపుణ్యాన్ని చాటుతూనే ఉన్నారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమ ఖ్యాతిని ఇనుమడింపచేసే విధంగా కలెక్టరేట్‌ రగుడుజంక్షన్‌లో ‘జోటా’ స్టాచ్యూ ప్రత్యేక ఆకర్షణనగా మారింది. రూ3.60కోట్ల వ్యయంతో చేపట్టిన జంక్షన్‌ అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మరోవైపు సిరిసిల్ల నేత కళాకారులు చేనేత, మరమగ్గాలపై అగ్గిపెట్టెలో అమరే చీర, ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, కుట్టు లేకుండా వస్త్రాలు, మగ్గంపైనే మనుషుల చిత్రాలు, బంగారం, వెండి ఉపయోగించి చీరల తయారీ ఇలా అనేక విధాలుగా ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా సిరిసి ల్ల వస్త్రపరిశ్రమ నిలిచింది. ఈ ఖ్యాతిని చాటిచెబుతూ సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని వేములవాడ దారిలో కలెక్టరేట్‌ రగుడు చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ కు సంబంధించిన అన్ని విభాగాలను చాటిచెబుతూ రూ.70లక్షలు వెచ్చిం చి ప్రతిమలను ఏర్పాటు చేశారు. చేనేత, మరమగ్గాల నేతలో కీలకంగా ఉండే ‘జోటా’ స్టాచ్యూ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటుచేశారు. వస్త్ర పరిశ్రమ లో కార్మికుల జీవనశైలి చాటుతూ ప్రతిమలు ఏర్పాటు చేయడంతో కలెక్ట రేట్‌ జంక్షన్‌ ప్రత్యేక ఆకర్షగా మారింది.

Updated Date - Jul 30 , 2026 | 12:47 AM