భక్తులతో కిక్కిరిసిన అంజన్న క్షేత్రం
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:32 AM
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది.
మల్యాల, జనవరి13 (ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. వేలాదిగా వచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చు కున్నారు. అనంతరం బేతాళుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగ కుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కాగా ఘాట్‌రోడ్డు, బొజ్జపోతన మార్గం భక్తులు వచ్చిన వాహనాలతో నిండిపోయింది.