Share News

సైక్లింగ్‌ను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:25 AM

సైక్లింగ్‌ను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌ సత్యనారాయణ అన్నారు.

సైక్లింగ్‌ను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సైక్లింగ్‌ను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సైకిల్‌ ర్యాలీని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైక్లింగ్‌తో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. పర్యావరక్షణ పరిరక్షణకు తోడ్పడే ఏకైక మార్గం సైక్లింగ్‌ అని అన్నారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూపర్యావరణ పరిరక్షణకు దృష్టిలో పెట్టుకొని సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలన్నారు. సైకిల్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్‌తోనే ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను సైక్లింగ్‌ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో సైక్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బి మధుసూదన్‌రెడ్డి, సంఘ ప్రతినిధులు బి జగదీశ్వరాచారి, అరవింద్‌ బాబు, మధు, తిరుపతి, ఎం మహేందర్‌, అఖిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:25 AM