Share News

అంగన్‌వాడీలకు సొంత భవనాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:21 AM

గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

అంగన్‌వాడీలకు సొంత భవనాలు
మన్నెంపల్లిలో చిన్నారులతో అక్షరాభ్యాసం చేపిస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

తిమ్మాపూర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని మన్నెంపల్లిలో అంగన్‌వాడీ భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో అక్షరాలు దిద్దించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల విద్యారంభానికి అక్షరాభ్యాసమే తొలిమెట్టు అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యాభివృధ్దికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పిల్లలకు మెరుగైన వసతులు, సురక్షితమైన వాతావరణంలో విద్యా, పోషకాహార సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పొన్నం సునీత, జిల్లా మహిళా సంక్షేమాధికారి సరస్వతి, డీఈపీఆర్‌ మంజుల, సీడీపీవో శ్రీలత పాల్గొన్నారు.

ఫ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంప్‌ కార్యాలయంలో 78 మందికి 26.23 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో అండగా నిలుస్తోందన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:21 AM