జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:32 AM
జనవరిలో చేపట్టే జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జనవరిలో చేపట్టే జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని బీసీ భవన్‌లో సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సంఘంలో చేరగా వారికి పర్ష హన్మాండ్లు కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హన్మాండ్లు మాట్లాడారు. జనవరిలో చేపట్టే జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని గత కొన్ని రోజులుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేద న్నారు. దీంతో డిసెంబరు 14,15 తేదిల్లో బీసీ జనగర్జన పేరిట చలో ఢిల్లీ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బీసీ జనగర్జన సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దేశంలో బీసీల లెక్కలు తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ముఖం చాటేస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్ని కల్లో బీజేపీపై బీసీలు కూడా మొఖం చాటేస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల్లోని బీసీ ఎంపీలు కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై, ఆయా పార్టీలపైన ఒత్తిడి తెచ్చి ఓబీసీ కాలమ్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు. బీసీల గురించి మాట్లాడని బీసీ ఎంపీలను జాతిద్రోహులుగా పరిగణించాలని సూచించారు. డీలిమిటేషన్, చట్టసభలో మహిళలకు 1/3 రిజర్వే షన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తోం దని, ఈ రిజర్వేషన్స్‌లో బీసీలకు సబ్‌కోటా లేకపోతే అన్యాయం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లలో బీసీలకు సబ్‌కోటాను కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించాల ని, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలన్నారు. ఈ సమావేశం లో నాయకులు బోయిని శ్రీనివాస్, గాజుల విద్యాసాగర్, బచ్చు ప్రసాద్, నల్ల శ్రీకాంత్, తిరుపతి, విజయ్, మల్లయ్య, రాజుగౌడ్, సాగర్, వేణు, సాయికృష్ణ, కొం డయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.