ఓబీసీ కుల గణన చేపట్టాలి..
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:22 AM
దేశంలో చేపట్టనున్న జన గణనలో ఓబీసీల కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో చేపట్టనున్న జన గణనలో ఓబీసీల కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘం నాయకులు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో చేపట్టనున్న జనగణనలో ఓబీసీల కుల గణన చేపడతామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. తక్షణమే ఓబీసీలోని ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దీక్షకు కార్పోరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, నాంపల్లి శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్లు గంధె మాధవి, తోట రాములు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి రంగు సంపత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు సంజీవ్, రాష్ట్ర కార్యదర్శి జీఎస్ ఆనంద్ పాల్గొన్నారు.