Share News

ధాన్యం కుంభకోణంపై విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:07 AM

జిల్లాలో ధాన్యం కుంభ కోణంలో బయటపడింది రవ్వంతేనని, లోతైన వి చారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి బయట పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

ధాన్యం కుంభకోణంపై విచారణ జరిపించాలి

వేములవాడ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ధాన్యం కుంభ కోణంలో బయటపడింది రవ్వంతేనని, లోతైన వి చారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి బయట పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ లక్ష్మీనర్సింహారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం కుంభకోణం వెనుక ఉన్న పాత్రధారు లు, సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. మల కపేటకు చెందిన శ్రీనివాస్‌, రుద్రంగికి చెందిన స్వామి అలియాస్‌ నర్సారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారని ఫోటోలు చూపిస్తూ చెప్పారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొన డానికి రాని చేతులు కోట్లాది కుంభకోణాలు చేసిన వారిని కాపాడేందుకు ముందుకు వస్తు న్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ ధాన్యాన్ని గోదాములకు తరలించిన రైతులకు సంబంధిం చిన ట్రక్‌ షీట్లు రాలేదన్నారు. అవినీతి వ్యవహా రంపై ప్రత్యేక దర్యాప్తు జరిపించి ఎమ్మెల్యే తన నిజాయితీని చాటుకోవాలన్నారు. ఈ సమావే శంలో ప్యాక్స్‌ చైర్మన్‌లు జలగం కిషన్‌రావు, రామ్మోహన్‌రావు, తిప్పని శ్రీనివాస్‌ సెస్‌ మాజీ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, సీనియర్‌ నాయకు లు గడ్డం హన్మాండ్లు, గొస్కుల రవి, వెంగల శ్రీకాంత్‌ గౌడ్‌, వాసాల శ్రీనివాస్‌, నిమ్మశెట్టి విజ య్‌, సిరిగిరి చందు, గోలి మహేష్‌, సుంకపాక రాజు, మామిండ్ల కనుకయ్య, మంత సందీప్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:07 AM