Share News

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:53 PM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

చందుర్తి, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై చందుర్తి మండలం మల్యాలలో బుధవారం గ్రామసభ నిర్వహించగా, జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా జిల్లా నీటి పారుదల శాఖ అధికారి రిజర్వాయర్లలో నీటి నిల్వ లపై వివరించారు. ఇప్పుడు ఉన్న నీరు తాగు నీటికే వినియోగిస్తా మని, పంటల సాగుకు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం అందరిపై ఉంటుం దని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై అవగాహన కల్పిం చామని గుర్తు చేశారు. ఎల్‌నినో ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరి స్థితుల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు. చందుర్తి మండలంలో గత ఏడాది 328 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయిందని తెలిపారు. ఈ ఏడాది 230 మిల్లిమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. భూగర్భ జలాలు గత ఏడాది 4.38 మీటర్ల లోతులో ఈ ఏడాది 8.38 మీటర్ల లోపలికి వెళ్లాయని వెల్ల డించారు. జిల్లాలోని ఎగువ మానేరు, శ్రీ రాజరాజేశ్వర(మిడ్‌ మానేరు), మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నీరు తాగునీటికి సరిపోతుందని పేర్కొ న్నారు. వ్యవసాయ పొలాలు, ఇండ్లలో నీటిని వృథా చేయవద్దని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, నువ్వులు, అధిక ఆదాయం వచ్చే ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్‌ పామ్‌కు రూ.23 వేల ఆదాయం వస్తుం దని వివరించారు. చందుర్తి మండలంలో 92 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ వేశారని, మిగతా రైతులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. సిద్ది పేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారని తెలిపారు. వీబీ జీ రాంజీ, తెలంగాణ జలసిరి కింద జల సంరక్షణకు ఎన్నో పథకాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్స్‌ రీచార్జ్‌ పనులు, అలాగే రైతుల పొలాల వద్ద ఫామ్‌పాండ్స్‌ బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులు ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెల్కల తిరుపతి, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధి కారి దయాకర్‌, రైతు విజ్ఞాన కేంద్రం శాస్రవేత సాయికుమార్‌, హౌసిం గ్‌ డీఈ సాజిద్‌, తహసీల్దార్‌ భూపతి, ఎంపీడీవో రాధ, సర్పంచ్‌ శారద, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:53 PM