Share News

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:52 PM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడ ల్లో రాణించాలని ఎంఈవో మురళి నాయక్‌, బీజేపీ మండల అధ్యక్షుడు, ధర్మారం సర్పంచ్‌ మిర్యాల్‌కర్‌ బాలాజీ అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

కోనరావుపేట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడ ల్లో రాణించాలని ఎంఈవో మురళి నాయక్‌, బీజేపీ మండల అధ్యక్షుడు, ధర్మారం సర్పంచ్‌ మిర్యాల్‌కర్‌ బాలాజీ అన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు కానుకగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆలోచన మేరకు సీఎస్‌ఆర్‌ నిధులతో సమకూర్చిన సైకిళ్లను 39 మంది పదో తరగతి విద్యార్థులకు శుక్ర వారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, సుద్దాల, మంగళపల్లి, పల్లిమక్త సర్పంచులు కుంటెల్లి నాగరాజు, అవురం మాన స శరత్‌, జిన్న అనూష, అనిల్‌, ఉప సర్పంచ్‌ సాయి, ప్రధానోపాధ్యాయురాలు మంజులతో పాటు బీజేపీ నాయకులు గోపాడి సురేందర్‌రావు, అంబోజ లక్ష్మీనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఎర్రవెల్లి విజయ్‌, జిన్న అనిల్‌, నాగరాజు, అవురము సురేష్‌, సాసాల రాకేష్‌, బుర్ర రమేష్‌, నీరటి వంశీ, ఊరడి మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:52 PM