Share News

రంజాన్‌కు అన్ని వసతులు కల్పించాలి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:52 PM

రానున్న రంజాన్‌ పండుగకు ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

రంజాన్‌కు అన్ని వసతులు కల్పించాలి

సిరిసిల్ల, జనవరి 20 (ఆంధ్ర జ్యోతి): రానున్న రంజాన్‌ పండుగకు ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రంజాన్‌ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీసు లతో, అన్ని మసీద్‌ కమిటీల అధ్యక్షులు, మైనార్టీ సంఘం ప్రతినిధుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న రంజాన్‌ సందర్భంగా జిల్లాలోని సిరి సిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, ఆయా గ్రామపంచాయతీల పరిధి లోని అన్ని మసీద్‌లు, ఈద్గాల వద్ద ప్రతి రోజు తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిత్యం పారిశుధ్య పనులు చేయాలని, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలని మున్సిపల్‌, గ్రామపంచాయతీ, సెస్‌ అధికారులను ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిం చాలని, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ కావాల్సిన మరమ్మ తులు, అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. పౌర సరఫ రాల శాఖ ఆద్వర్యంలో రేషన్‌ సరుకులు, సిలిండర్లు అందుబాటు లో ఉంచాలని సూచించారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ కోసం ముందస్తుగా సమావేశం నిర్వహించిన అధికారులకు మైనార్టీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజే శారు. కబ్రస్తాన్లలో భారీ వృక్షాలను తొలగించాలని, పరిసరాలు శుభ్రం చేయాలని, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, సిరిసిల్లలో స్లాటర్‌ హౌస్‌ నిర్మించాలని, ప్రతిమూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పా టుచేయాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారం అం దించాలని మసీద్‌ కమిటీల అధ్యక్షులు కోరారు. సమావేశంలో అడిష నల్‌ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:52 PM