గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:22 AM
గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరే ట్‌లోని మినీ సమావేశ మందిరంలో శుక్రవారం గణతంత్ర వేడుకల నిర్వ హణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ భారత గణ తంత్ర వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించేందుకు వేదికలను రెవెన్యూ అధికారులు పూల అలంకరణతో సిద్ధం చేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, వారికి ఆహ్వా నం పంపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన స్టాల్స్, శకటాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారు లను ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారులను నియమించాలని సూచించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వీలుగా, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారుచేయాలని జిల్లా ప్రణాళిక అధికారికి సూచిం చారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఆ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది ఉండాలని పేర్కొన్నారు. గ్రౌండ్‌లో పారిశుధ్య పనులను చేపట్టాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. వేడుకల సందర్భంగా గ్రౌండ్‌కు వచ్చే ప్రజలతో పాటు విద్యార్థులకు తాగునీటిని సమకూర్చాలని, జాతీయ భావం పెంపొందేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించేందుకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని అధికా రులను ఆదేశించారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు..
భారత గణతంత్ర వేడుకల కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బీ గితేతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. గ్రౌండ్‌లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏవో రాంరెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు.