Share News

కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు.

ABN , Publish Date - May 06 , 2026 | 12:18 AM

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు సెప్టెంబరులో కరీంనగర్‌లో జరగనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు.
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు సెప్టెంబరులో కరీంనగర్‌లో జరగనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు కరీంనగర్‌ ఆతిఽథ్యం ఇవ్వడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఉందన్నారు. మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడిపై ఉందని, అందుకు మహాసభలకు సంబంధించిన ఆహ్వాన సంఘం కమిటీని, ఇతర కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు వీఎస్‌ బోస్‌, పంజాల శ్రీనివాస్‌, రామడుగు లక్ష్మణ్‌, తాండ్ర సదానందం, చెన్న విశ్వనాథం, మంద సుదర్శన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసఫ్‌, బాల్‌ రాజ్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జి వెంకటేష్‌, కరుణ, ప్రవీణ్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శులు కదారి సునీల్‌, రాములు, వేణు, పిట్టల సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:18 AM