ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:30 AM
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపా యాలు, బోధనపై అవగాహన కల్పించి విద్యార్థుల ప్రవేశాలు పెంచా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
చందుర్తి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో సదుపా యాలు, బోధనపై అవగాహన కల్పించి విద్యార్థుల ప్రవేశాలు పెంచా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చందుర్తి మండలం ఆశిరె డ్డిపల్లిలోని గొల్లపల్లిలో ప్రాథమిక పాఠశాల రెండేళ్ల క్రితం మూతపడ గా, బడిబాటలో భాగంగా విద్యార్థుల ప్రవేశాలు కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై పాఠశాలను శుక్రవారం పునఃప్రారంభించారు. పాఠశాల ఆవరణలో గల అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థులకు కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించా రు. అనంతరం యూనిఫామ్‌లు పంపిణీ చేశారు.కిష్టంపేటలో పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వచ్చిన ఆటల పరికరాలు, బొమ్మలను పరిశీలించారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారో ఆరాతీశారు. ఈసందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పుస్తకాలు, నోట్ బుక్‌లు, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లి దండ్రులు ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల లో పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. సదుపాయాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతోపాటు ఆటలు ఉంటాయని వెల్లడించారు. పిల్లలు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, చదువుతోపాటు ఆటలు ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధ, విద్యాశాఖ అధికారులు వినయ్ కుమార్, సతీష్, సర్పంచ్‌లు బోజ్జ మల్లేశం, మొకినపల్లి దేవరాజు, విద్య శాఖ, సంక్షేమశాఖ, ఉపాధ్యాయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.