Share News

రైతులకు సరిపడా యూరియా నిల్వలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:55 PM

జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అం దుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ తెలిపారు. బుధవారం జగిత్యాల రూరల్‌ మండలంలోని పొలాస గ్రామంలో గల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువు ల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మి కంగా తనిఖీ చేశారు.

 రైతులకు సరిపడా యూరియా నిల్వలు
పొలాసలో ఎరువుల విక్రయ గోదాంను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌

జగిత్యాలరూరల్‌, జూన 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అం దుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ తెలిపారు. బుధవారం జగిత్యాల రూరల్‌ మండలంలోని పొలాస గ్రామంలో గల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువు ల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. అనంతరం జాబితాపూర్‌ గ్రామంలో గోదాముల నిర్మాణా నికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని పరీశీ లించారు. అంతర్గాం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరీశీలించారు. యూరియా యాప్‌ ద్వారా విక్రయాలను పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ యాప్‌ ద్వారా రైతులు యూరియా బుక్‌ చేసుకొని కొనుగోలు చేయాలని సూచించారు. గోదాముల నిర్మాణానికి సంబంధించి పనులు తక్షణమే చేపట్టాలని కలెక్టర్‌ సహకార అధికా రి మనోజ్‌కుమార్‌ను ఆదేశించారు. జాబి తాపూర్‌ ప్రాంతం జిల్లాలో ధాన్యం నిల్వకేం ద్రంగా మారుతుందని అన్నారు. కార్యక్రమం లో డీసీవో మనోజ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయా ధికారి భాస్కర్‌. ఏడీఏ తిరుపతినాయక్‌, తహసీల్దార్‌ హకీమ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:55 PM