Share News

ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:59 PM

జిల్లాలో ఇంటర్మీ డియట్‌ పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ పరిశీలించారు.

ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంటర్మీ డియట్‌ పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ పరిశీలించారు. మంగళవారం సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల జూని యర్‌ కళాశాల, సహస్ర జూనియర్‌ కళాశాల, సాయిశ్రీ జూనియర్‌ కళాశాల అలాగే తంగళ్ళపల్లి మండలం బద్దెనప ల్లిలోని టీజీఎస్‌డబ్య్లూఆర్జేసీ కళాశాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 16పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 4046మంది, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 4060 మంది పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొ న్నారు. పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేపట్టనున్నారని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శరత్‌ కుమార్‌, తంగళ్ళపల్లి మండలం తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌ రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:59 PM