హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడపాలి
ABN , Publish Date - May 17 , 2026 | 12:30 AM
సిరిసిల్ల నుంచి హైదరా బాద్‌కు అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నాయకులు ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, మే 16 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల నుంచి హైదరా బాద్‌కు అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నాయకులు ధర్నా చేపట్టారు. పాత బస్టాండ్‌లో బస్సుల రాకపోకలను అడ్డుకుంటూ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ నాయ కుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడారు. జిల్లా కేంద్రమైన సిరి సిల్ల నుంచి సికింద్రాబాద్-హైదరాబాద్‌కు సరిగా బస్సులు లేకపోవడంవల్ల ప్రజ లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వేములవాడ డిపో నుంచి సికిం ద్రాబాద్ వెళ్లే బస్సులు వేములవాడ బస్టాండ్‌లోనే సీట్లు నిండిపోయి సిరిసిల్లకు రావడంతో జిల్లా కేంద్రం నుంచి వెళ్లాలనుకునే ప్రయాణికు లకు సీట్లు దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రతి రోజు జిల్లా కేంద్రం సిరిసిల్ల నుంచి వేల సంఖ్యలో ప్రజలు రాజధానికి వెళ్తుంటారని సిరిసిల్ల డిపో బస్సులను సిరిసిల్ల నుంచి సికింద్రబాద్- హైదరాబాద్‌కు అదనంగా బస్సులు వేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతుందన్నారు. ఖాళీ బస్సుల కోసం సిరిసిల్ల నుంచి వెళ్లే ప్రయాణికు లకు ఇబ్బందులు తప్పుతాయని సూచించారు. గతంలో సిరిసిల్ల డిపో మేనేజర్‌కు కూడా సిరిసిల్ల నుంచి అదనపు బస్సులను వేయాలని వినతిపత్రం ఇచ్చామన్నారు. ప్రతిరోజు ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అరగంటకు ఒక్క బస్సును సిరిసిల్ల నుంచి సికింద్ర బాద్-హైదరాబాద్‌కు వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమం లో నాయకులు శీనివాస్, వినయ్‌కుమార్, శేఖర్, ప్రవీణ్, అజ్జు అబ్బి, పవన్, వెంకటేశం, లక్ష్మణ్, భాను, రాజు, నరేష్, రాము పాల్గొన్నారు.