Share News

కార్యకర్తలు ‘సర్‌’పై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:17 AM

కార్యకర్తలు ‘సర్‌’పై అవగాహన పెంచుకోవాలని కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు.

కార్యకర్తలు ‘సర్‌’పై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌ కుమార్‌

కరీంనగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలు ‘సర్‌’పై అవగాహన పెంచుకోవాలని కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో ‘సర్‌’(స్పెషల్‌ ఇంటోన్సివ్‌ రివిజన్‌-2026)పై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ. ‘సర్‌’పై అవగాహన కల్పించేందుకు మైనార్టీసెల్‌ మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని అభినందించారు. ఓట్ల మ్యాపింగ్‌పై ఏజెంట్లకు పూర్తి అవాగహన కల్పించే విధంగా ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు అబ్దుల్‌ ముజీబ్‌ అయ్యూబ్‌, ఎహ్తెషామ్‌ఉల్‌హక్‌, వసీంఅక్రం బీఎల్‌ఏల పాత్ర, బాధ్యతలు, ఎన్యుమరేషన్‌ ఫార్ములా, ఓటర్ల ధ్రువీకరణ, సెల్ఫ్‌ మ్యాపింగ్‌, ప్రోజెనీ మ్యాపింగ్‌, క్లెయిమ్స్‌, అభ్యంతరాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్‌ జిల్లా చైర్మన్‌ మొహమ్మద్‌ తాజోద్దీన్‌ ఏస్టీ సెల్‌ చైర్మన్‌ శ్రవణ్‌ నాయక్‌, ఇక్రం సికిందర్‌, నేహాల్‌ అహ్మద్‌, అహ్మద్‌ అలీ, లయీక్‌ ఖాద్రీ, ముస్తాక్‌, అబ్దుల్‌ రహమాన్‌, ఎండీ చాంద్‌, ఆమెర్‌, గంగుల దిలీప్‌, జమీల్‌ అహ్మద్‌ భాయ్‌, బషీర్‌, అబ్దుల్‌ బారి, అజీం, సలీం పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:18 AM