Share News

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:22 AM

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్ష ణతో పాటు పోలీస్‌ స్టేషన్‌ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా బుధ వారం కోనరావుపేట పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ మహేష్‌ బీ గితే తనిఖీ చేశారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

కోనరావుపేట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్ష ణతో పాటు పోలీస్‌ స్టేషన్‌ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా బుధ వారం కోనరావుపేట పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ మహేష్‌ బీ గితే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్‌ దర్యాప్తులు, స్టేషన్‌ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించి, ప్రజలకు అంది స్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయా సమ స్యలతో పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతగా మెలగాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలస త్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌లో వర్టికల్స్‌ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థపై అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాం తాల ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామా ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్‌ అరెస్టుల వంటి సైబర్‌ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామీ ణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని, డయల్‌ 112కు కాల్‌ రాగానే పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది స్పందించి సూచించారు. ఆయన వెంట సిఐ రవీందర్‌, ఎస్‌ఐ రామ్మోహన్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 12:22 AM