కొనుగోళ్లలో జాప్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:57 PM
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హెచ్చరించారు.
వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), నవంబరు28(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హెచ్చరించారు. వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 24న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం..రైతన్న ధైన్యం’ కథనానికి అదనపు కలెక్టర్ నగేష్ స్పందించారు. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. కేం ద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడం వల్ల సంబంధిత శాఖ అధికారులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం వేయడంలో ఎందుకు ఆల స్యమవుతోందని ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వీడి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భూముల రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
వీర్నపల్లి మండల కేంద్రంలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. మండల కేం ద్రంలో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి సర్వే చేయాలని సూచించారు. గ్రామాల్లో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తోందని అన్నా రు. ఆయన వెంట తహసీల్దార్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.