Share News

నిబంధనల ఉల్లంఘనపై చర్యలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:45 PM

మండలంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు’ అనే శీర్షీకతో బుధవారం కథనం ప్రచురితం అయ్యింది.

నిబంధనల ఉల్లంఘనపై చర్యలు
మహత్మానగర్‌లో ఇంటికి నోటీసులు అంటిస్తున్న పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది

తిమ్మాపూర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు’ అనే శీర్షీకతో బుధవారం కథనం ప్రచురితం అయ్యింది. ఈ కథనానికి స్పందించిన అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల వ్యాప్తంగా ఎన్ని అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయి.. అనుమతి ఒకలా, నిర్మాణాలు మరోలా ఉన్న నిర్మాణాల వివరాలు సేకరిస్తున్నారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యాదర్శులు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. మహాత్మానగర్‌ గ్రామంలో జీ ప్లస్‌ 1 ఫ్లోర్‌కు అనుమతి తీసుకొని జీ ప్లస్‌ 4 ఫ్లోర్స్‌ నిర్మిస్తున్న ఇంటికి బుధవారం నోటీసులను అంటించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై డీపీవో జగదీశ్వర్‌ను వివరణ కోరగా నిబంధనలు ఉల్లఘించిన ఇళ్ల యజమానుల జాబితాను సిద్ధం చేయాలని ఎంపీవోను ఆదేశించామన్నారు. భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి సరైన సమాధానం రాకపోతే కూల్చేస్తామని తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 11:45 PM