నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:45 AM
జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆసుపత్రులను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్ రజిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆసుపత్రులను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్ రజిత అన్నారు. శనివారం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి 4 నుంచి జూన్ 9వరకు నాలుగు దశలో వందరోజుల హెల్త్ మిషన్ ఆరోగ్య శిబిరాలపై సమీక్షించారు. అనంతరం హెల్త్ మిషన్ ఆరోగ్య శిబిరంలో 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు నిర్వహించే అసంక్రమిత వ్యాధులు, రక్తపోటు, మధుమోహం, గర్భాశయ, నోటి, రొమ్ము క్యాన్సర్, క్షయ వ్యాధి నివారణపై గర్భిణులు, పిల్లల తల్లుల కు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత వివరించారు. అనంతరం మండల వైద్య అధికారులకు ఒక్క రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు వైద్యులు సంపత్, రామకృష్ణ, అనిత, నహీమా, వివిధ మండలా ల వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.