Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:53 PM

వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే

హుజూరాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే హెచ్చరించారు. హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిని ఆమె శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగికి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతిరోజు ఓపీలకు వచ్చే రోగులు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రొంటాల సుహాసిని, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిప్రసాద్‌, ఆర్డీవో జలకుమారి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ హఖీయొద్దీన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రభుదాస్‌, తహసీల్దార్‌ నరేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కిషన్‌, కౌన్సిలర్‌ భారతి పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:53 PM