శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:38 AM
శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్ బి.గితే హెచ్చరించారు.
వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), జూలై10(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్ బి.గితే హెచ్చరించారు. వీర్నపల్లి పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. పోలీ స్‌స్టేషన్ పరిసరాలు, కేసుల వివరాలు, సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్ బి. గితే మాట్లాడుతూ జిల్లాలో అసాం ఘీక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పాత నేరస్థుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని అన్నారు. ప్రజా భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహించి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు విజిబుల్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. నేరాల నియంత్రణ, చోరీలు, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవించేందుకు చర్యలు చేపట్టామని ఎస్పీ మహేశ్ బి. గితే అన్నారు. ఆయన వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, ఎస్‌ఐ లక్ష్మణ్‌లు ఉన్నారు.