అధిక ధరలు తీసుకుంటే చర్యలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:37 AM
జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో వినియోగదారుల వద్ద నుంచి నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మీ సేవ కేంద్రాల జిల్లా ఈడీఎం శ్రీనివాస్ హెచ్చరించారు.
ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో వినియోగదారుల వద్ద నుంచి నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మీ సేవ కేంద్రాల జిల్లా ఈడీఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఇటీవల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆపరేటర్‌ను తొలగించామని పేర్కొన్నారు. కొత్త ఆపరేటరును నియమించామని చెప్పారు. జిల్లాలో 92 మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రాల్లోని సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల అవసరాలను బట్టి మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు మొదటి ప్రాధాన్యత కల్పించి ఇంటర్వ్యూల ద్వారా నియమిస్తున్నామని ఈడీఎం శ్రీనివాస్ అన్నారు. ఆయన వెంట డీఎం మహేశ్ ఉన్నారు.