చిన్నారి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:03 AM
చిన్నారి మౌనిక మృతికి బాధ్యులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులు జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధ్యుల దిష్టి బొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : చిన్నారి మౌనిక మృతికి బాధ్యులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులు జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధ్యుల దిష్టి బొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. అనంతరం కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి చిన్నారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులు, కౌన్సిలర్ కాసర్ల పద్మ, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో రజకసంఘం ఆధ్వర్యంలో కులదురహంకారుల దిష్టిబొమ్మను మంగళవారం దహ నం చేశారు. వ్యవసాయకార్మిక సంఘ జిల్లా కార్యదర్శి గన్నారం నర్సయ్య, మండల ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు ఎల్లవేని రమేష్, అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు పసుల నరేష్, రజకసంఘ అధ్యక్షుడు ఇల్లంతకుంట పర్శరాం, నాయకులు సాయి, చందు, రమేష్, అనీల్, శ్రీనివాస్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ : మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట రజక సంఘం, బీసీ, ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, శివకేశవుల ఆలయ కమిటీ ఛైర్మన్ మిరుదొడ్డి శరయ్య, బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు కొండ యాద గిరిగౌడ్, సత్తయ్య, కోడె శ్రీనువాస్, రంజాని నరేశ్, హనుమయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.