ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కార్యాచరణ
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:44 AM
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేయడంతో పాటు రైతులు ఉద్యానవన పంట లను సాగు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేయడంతో పాటు రైతులు ఉద్యానవన పంట లను సాగు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, భూగర్భజల, ఎన్పీడీసీఎల్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ కమిష నర్లు, జిల్లా పంచాయతీ అధికారిలతో అధికారులతో ప్రత్యామ్నాయ పంటలతో పాటు నీటి వృథాను అరికట్టడంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు క్రమంగా తగ్గడం, భూగర్భ జలాలు రానురాను తగ్గుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంట లు కూరగాయలు, పప్పుదినుసులు, ఆయిల్‌పామ్ తదితర పంటల సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారు లు మండలాలవారీగా నీటి వనరుల లభ్యత ఆధారంగా పంటలు సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభి వృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జలసిరి కింద బోర్వెల్ రీఛార్జి గుంతలు, ఫామ్‌పాండ్, మ్యాజిక్ సోక్‌పిట్ తదితర పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయా లని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కూలీలకు వీబీజీ రామ్ జీ కింద నిర్దేశిత లక్ష్యం మేరకు ఉపాధి పనులు చేయించాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, యంత్రాలు ఇతర ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలకు అవసరమైన నీటిని సర ఫరా చేయాలని ఆదేశించారు. అలాగే నీటి వృథాను అరికట్టాలని సూచించారు. అన్ని నల్లాలకు ఆన్ఆఫ్ స్విచ్‌లు ఉండేలా చూసుకోవాలన్నారు. సిరిసిల్ల, వేము లవాడ మున్సిపాలిటీల, గ్రామపంచాయతీ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయా లని స్పష్టం చేశారు. భూగర్భజల శాఖ అధికారులు జలాల లభ్యత, నీటి మట్టా లపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ అధికారులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయా లని ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు అవసరమైన గడ్డి, నీటితొట్టిల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి తొట్టిల నిర్వహణ, మరమ్మతు, నీటిని నింపడం అంశాలను జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించా రు. ఈ సమావేశంలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్, జిల్లా పశు సంవ ర్ధక శాఖ అధికారి శ్రీధర్, జిల్లా వైద్య అధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేష్, డీపీవో వీరభద్రయ్య, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, భూగర్భ జల, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ, గ్రామీణ అభి వృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.