Share News

నూతన గోదాంల నిర్మాణాలకు కార్యాచరణ

ABN , Publish Date - May 15 , 2026 | 12:10 AM

జిల్లాలో నూతన గోదాంల నిర్మాణాలకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

నూతన గోదాంల నిర్మాణాలకు కార్యాచరణ

సిరిసిల్ల అర్బన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నూతన గోదాంల నిర్మాణాలకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, నాబార్డు, పరిశ్రమల శాఖ, ఎల్‌డీఎం, తహసీల్ధార్‌, మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో గోదాంల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంట ఉత్పత్తుల నిల్వల కోసం నూతన గోదాంల నిర్మాణాలకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. స్థలాలను గుర్తించి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. త్వరగా పను లు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అద నపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కె టింగ్‌ అధికారి ప్రకాష్‌, మార్క్‌ఫెడ్‌ అధికారి హబీబ్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ నర్సింహా, నాబార్డ్‌ డీడీఎం దిలీప్‌, పరిశ్రమల శాఖ అధి కారి హనుమంత్‌ నాయక్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌రావు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:10 AM