నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:28 AM
నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ అన్నారు.
వేములవాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ అన్నారు. వేములవాడ పట్టణంలోని నందికమాన్ చౌర స్తాలో గురువారం స్కూల్ బస్సుల తనిఖీలను చేపట్టారు. తనిఖీల్లో ఫైర్ సేప్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, తాగునీటి సౌకర్యం, డ్రైవర్‌తో పాటు అటెండర్ అందబాటులో ఉండటం, ఎమర్జెన్సీ డోర్ పనితీరు వంటి అంశా లను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ పాఠశాల, కాలేజీల బస్సుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వర్షాకా లాన్ని దృష్టిలో ఉంచుకుని వైపర్లు, రివర్స్ హారన్‌తో పాటు వాహనం ఫిట్ నెస్‌కు సంబంధించిన అన్ని పరికరాలు సక్రమంగా పనిచేయాలని సూ చించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని రెండు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.