Share News

కూలి పెంచని యజమానులపై చర్యలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:46 AM

కాటన్‌ చీరల కూలి పెంచని యజమానులపై చర్యలు తీసుకోవా లని, సమస్య పరిష్కారానికి అధికారులు సహకరించకుంటే సోమవారం రోజున కలెక్టరేట్‌ ముందు దీక్ష చేపడుతామని పవర్లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేష్‌ హెచ్చరించారు.

కూలి పెంచని యజమానులపై చర్యలు

వేములవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : కాటన్‌ చీరల కూలి పెంచని యజమానులపై చర్యలు తీసుకోవా లని, సమస్య పరిష్కారానికి అధికారులు సహకరించకుంటే సోమవారం రోజున కలెక్టరేట్‌ ముందు దీక్ష చేపడుతామని పవర్లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేష్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని యారన్‌ ఇన్‌ఫర్మెంట్‌ అధికారి అనితకు శుక్రవారం కార్మికులందరు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రమేష్‌ మాట్లాడుతూ కాటన్‌ చీరల నడిపించే కార్మికుల, ఆసాముల కూలి పెంచాలని చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరుకుందని అన్నారు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పవర్లూమ్‌పై చీరల ఉత్పత్తి చేస్తే అధిక లాభాలు ఆర్జించుకుంటూ, కార్మికులకు కూలి పెంచడానికి నిరాకరిస్తున్న యజమానుల మొండి వైఖరిని ఖండిస్తున్నామని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్ట వ్యతిరేఖంగా చీరల ఉత్పత్తి చేయిస్తూ కార్మికుల కష్టంతో కోట్లు గడిస్తున్న యజ మానులు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. జిల్లా కలెక్టర్‌కు పది రోజుల క్రితం వినతిపత్రం అందజేసిన, ఏడీకి అందించి సమస్య పరిష్కరించాలని సూచించారని, ఇంత వరకు చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా చీరల ఉత్పత్తి చేస్తున్న యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తమ ను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాతో కార్మికులను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే సమస్య పరి ష్కారం చేయకుంటే సోమవారం రోజున కలెక్టరేట్‌ ముందు దీక్ష చేసేం దుకు కార్మికులందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బూర మల్లేశం, వడ్నాల వీరేశం, నాగేష్‌, చిరంజీవి, కనుకయ్య తది తరులు ఉన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:46 AM