ఆదర్శప్రాయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:24 AM
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి విడత ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ ఆదర్శప్రాయుడిగా చరిత్ర లో నిలిచిపోయారని మున్సి పల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి విడత ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ ఆదర్శప్రాయుడిగా చరిత్ర లో నిలిచిపోయారని మున్సి పల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలో ఆచా ర్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహిం చారు. స్థానిక విద్యానగర్ రగుడు మొదటి బైపాస్ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూ జీ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కళాచక్రపాణి, నాయ కులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్‌పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాల య్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షుడు మోర రవి, కోశా ధికారి యెల్లె శ్రీనివాస్, మహిళ పట్టణ అధ్యక్షురాలు కాముని వనితనళినీకాంత్, సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, ప్రధాన కార్యదర్శి వేముల రాజశేఖర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, మాజీ కౌన్సిలర్ యెల్లె లక్ష్మినారాయణ, పద్మశాలి సంఘం, చేనేత వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ధీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షుడు దేవదాస్, సంయుక్త కార్యదర్శి సుదర్శన్, యూత్ అధ్యక్షుడు భాస్క ర్, గౌరవ అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, సభ్యులు దేవదాస్, గంగారాం, లక్ష్మీనారాయణ, సిద్ధిరాములు, రాజేశం, తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో కొండా లక్ష్మన్ బాపూజీకి సోమవారం ఘనంగా వర్ధంతిని నిర్వహించా రు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపీపీ చిలుక పెంటయ్య, సింగిల్ విండో మాజి చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు పోతరాజు నగేష్, దుమ్మ అంజయ్య, సత్యం, రవిందర్, శంకర్, వంశీ, తిరుపతిరావు, రాములు, రవి,రాంచంద్రం, రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.