Share News

వేములవాడ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు

ABN , Publish Date - May 25 , 2026 | 11:56 PM

వేములవాడలో జరుగుతున్న అభి వృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు

సిరిసిల్ల టౌన్‌, మే 25 (ఆంధ్రజ్యోతి) : వేములవాడలో జరుగుతున్న అభి వృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పది సంవత్సరాల అవినీతి, అక్రమాలను మరిచిన నాయకులు కాంగ్రెస్‌ అధికా రంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో వేములవాడలో జరుగుతున్న అభి వృద్ధిని చూసి ఓర్వలేని పరిస్థితులలో అధినాయకుడి మెప్పు కోసం ప్రెస్‌మీట్లలో పలు అంశాలపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రంను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అప్పజెప్పితే పూర్తిగా అప్పుల ఊబిలో పూడ్చేసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు తీసుకురావడంతో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం చేసిన ఒక్కొటికిగా ప్రక్షాళన చేస్తూ వస్తున్నారన్నారు. సిరిసిల్ల నేత కార్మికులను ముంచి రూ. 352 కోట్లు అప్పుపెట్టి పోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు తీర్చి ఎనిమిది కోట్ల మీటర్ల ఇందిరమ్మ మహిళ శక్తి చీరలకు ఆర్డర్లు ఇచ్చి అండగా ఉందన్నారు. కార్మికుడికి నెలకు రూ.20వేల నుంచి రూ. 25వేల వరకు వేతనాలను అందుకుంటున్నారన్నారు. అగ్రకులాలకు చెందిన అధినాయ కుడుకి బీసీ నాయకులు వత్తాసు పలుకుతూ బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్‌పై విమ ర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆది శ్రీనివాస్‌ ఓడినా, గెలిచిన ప్రజల మధ్య ఉన్నాడన్నారు. కలికోట గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదన్నారు. కలికోట ప్రాజెక్టుకు 2018లో శిలాఫలకం వేసి తట్టెడు మన్నుపోయ లేదని విమర్శించారు. రైతులు, ధాన్యం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ ఎస్‌ నాయకులకు లేదన్నారు. సమావేశం లో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్ప దండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవ య్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్య క్షురాలు కాముని వనిత, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, కౌన్సిలర్లు శ్రీశై లం, శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ దుబాల వెంకటేశం, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:56 PM