పక్కాగా ఇందిరమ్మ బీమా వివరాలు నమోదు
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:05 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివ రాలు అందరికీ చేరవేయాలని, ఆన్‌లైన్ బీమా దరఖాస్తులో వివరాలు పక్కాగా నమోదు చే యాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, నవంబరు 20 (ఆంరఽధజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివ రాలు అందరికీ చేరవేయాలని, ఆన్‌లైన్ బీమా దరఖాస్తులో వివరాలు పక్కాగా నమోదు చే యాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఏర్పా టుచేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాలను ప్రారంభించడంతోపాటు, ఇం దిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవ గాహన కల్పించేందుకు రూపొందించిన కరప త్రాలను సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించా రు. అంతకుముందు వేములవాడ అర్బన్ మండ లం చీర్లవంచలో బీమా శిబిరాల్లో హెల్ప్ డెస్క్ లు, రిజిస్టర్లులో దరఖాస్తుదారుల వివరాలు నమోదు పరిశీలించారు. ఆన్‌లైన్‌లో బీమా వివ రాలు నమోదు చేస్తుండగా, పరిశీలించి.. ప్రక్రి య పూర్తిఅయ్యేందుకు ఎంత సమయం పడు తుందో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేము లవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయ తీల్లో ప్రత్యేక శిబిరాలు డిసెంబర్ 19వ తేదీ వర కు కొనసాగుతాయన్నారు.అన్ని కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయని వివరించారు. బీమా వివరా ల నమోదు సమాచారం చేరవేయాలని ఆదే శించారు. అర్జీదారులు రేషన్‌కార్డు, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రత్యేక కేంద్రాల్లో బీమా వివరాలు, నామినీ వివరాలు పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చంద్రకళ, కౌన్సిలర్లు బూర బాలు, దూడం రజిని, దొంతునేని కళ్యాణి తదితరులు పాల్గొన్నారు..
సద్వినియోగం చేసుకోవాలి..
కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఆర్థి కంగా ఇబ్బందులు పడకుండా ఇందిరమ్మ కు టుంబ బీమా పథకం ఉపయోగపడుతుందని, అర్హులైన ప్రతిఒక్కరు ఈ పథకాన్ని సద్వినియో గం చేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కళాచక్రపాణి అన్నా రు. మున్సిపల్ పరిధి లో వివిధ వార్డుల్లో కౌన్సిలర్లతో కలిసి శిబి రాలను ప్రారంభించా రు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడు తూ రేషన్ కార్డు కలి గిన ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుందని ఆ కుటుంబ సభ్యులను నామినీగా ఏర్పాటుచే సుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్క రూ ఈపథకాన్ని సద్వినియోగం చేసుకునే విధం గా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించామన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా, నేతన్న బీమా, గీత కార్మికుల బీమా వంటి వివిధ ప్రభుత్వ బీమా పథకాలు ప్రారంభించి ఆపద సమయం లో ఆయా కుటుంబాలకు అండగా నిలిచారన్నా రు. అయితే ఈ సంవత్సరం రైతు బీమా వంటి పథకాలకు ప్రీమియం చెల్లించలేదని, అదేవిధం గా నేతన్న బీమా పథకం కూడా కొనసాగట్లేదని తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ఒక సిరిసిల్లలోనే దా దాపు 30 మంది నేత కార్మికులు మరణించారని, వారికి నేతన్న బీమా పథకం ద్వారా కానీ ప్రభు త్వం ద్వారా కానీ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.