Share News

నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే ప్రమాదాలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:32 AM

నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా రవాణా శాఖాధికారి లక్ష్మణ్‌ అన్నారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే ప్రమాదాలు

తంగళ్లపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా రవాణా శాఖాధికారి లక్ష్మణ్‌ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ అధ్వర్యంలో మంగళవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని ఐటిడిఆర్‌లో ఆటో డ్రైవర్లు, టాక్సి క్యాబ్‌ డ్రైవర్లు, సరుకు రవాణా చేసే డ్రైవర్లకు రోడ్డు భధ్రతపై అవగహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే తంగళ్లపల్లి మండల కేంద్రంలో డ్రైవర్లు, యువతతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రతిఙ్ఞ చేయిం చారు. ఈ సందర్భల్లో జిల్లా రవాణా శాఖ అధికారి మాట్లడుతూ ప్రమాద రహిత డ్రైవింగ్‌ ఎలా చేయాలి వాహనాలు నడిపేడప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పని సారిగా హెల్మెట్‌ ధరించాలని, ఫోర్‌ వీల్లరు నడిపేటప్పుడు సీట్‌ బెల్టు ఽధరించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీవో సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, ఐటిడిఆర్‌ ప్రిన్సిపాల్‌ దొరయ్‌ మురుగన్‌, సహయక మోటర్‌ తనిఖీ అధికారి రజని, పృథ్వీరాజ్‌ వర్మ, యూత్‌ కాంగ్రేస్‌ నాయకుడు చుక్క రాజశేఖర్‌. సిబ్బంది సౌమ్య, రమ్య, ప్రశాంత్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:32 AM