పకడ్బందీగా ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:45 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఐదు దశల్లో చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఐదు దశల్లో చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో బుధ వారం సాయంత్రం ప్రజాపాలన-ప్రగతి ప్రణా ళిక కార్యకర్యమాలతో పాటు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హు లైన ప్రతి లబ్ధిదారు నికి పారదర్శకంగా అందించడం ప్రభు త్వ ప్రధాన లక్ష్యమ ని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రయోజ నం చేకూరే విధం గా పతకాలను అమ లు చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించా ల్సిన భాధ్యత ఉందన్నారు. ప్రతి జిల్లా అధి కారి తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశా లకు అనుగుణంగా పథకాలు అమలు చేయా లని అదేశించారు. ఈనెల 6వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలల్లో కార్యక్రమాలు అమలు చేయాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలు, ప్రత్యేక శిబిరాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయ వంతం కావాలంటే అధికారులు బాధ్యతాయు తంగా, పారదర్శకంగా సమయపాలనతో పని చేయాలని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని సూచించారు.
ఐదు దశల్లో కార్యక్రమాలు
మొదటి దశలో ఏప్రిల్ 2 నుంచి గ్రామ స్థాయిలో గ్రామసభల నిర్వహణ, రెండవ దశ ఏప్రిల్ 16 నుంచి మండల స్థాయిలో కార్యక్ర మాలు, మూడో దశ మే 2నుంచి నియోజక వర్గ స్థాయిలో కార్యక్రమాలు, నాలుగో దశలో మే 22 నుంచి జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్ర మాలు, ఐదో దశలో జూన్ 2 నుంచి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌డీవో గీతా, జిల్లా విద్యాధి కారి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అఽధికారి షరీఫో ద్దీన్, జిల్లా వైధ్యాధికారి డాక్టర్ రజిత, హౌజిం గ్ పీడీ సాజిద్, మున్సిపల్ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.