కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:00 AM
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్య డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో సతమతవుతున్నారని తెలిపారు. కార్డులను పాత పద్ధతిలోనే కొనసపాగించాలని, పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి ప్రతినెలా రూ. 5,000లు పెన్షన్ ఇవ్వాలని, సహజ మరణానికి అందించే ఎక్స్‌గ్రేషియా 2 నుంచి 5 లక్షలకు పెంచాలని, మెటర్నటీ, మ్యారేజ్ గిఫ్టు లక్ష రూపాయలకు పెంచాలని కోరారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గందె కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుల కుమార్, బత్తుల శ్రీనివాస్, ఐలవేణి రాజ్‌కుమార్, రెడ్డి మొండయ్య, వీ రాజు, జి రాజయ్య, ఎం శ్రీనివాస్, ఏ శశికుమార్, అరవింద్, సాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.