ఓటును కాపాడుకోవడానికి పోరాటం..
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:09 AM
ఓటును కాపాడుకోవడం కోసం రెండవ స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ఏఐసీసీ సర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడు శరత్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఓటును కాపాడుకోవడం కోసం రెండవ స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ఏఐసీసీ సర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడు శరత్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్ష తన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి శరత్ హాజర య్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఓట్లను కాపాడాలని, దేశాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ పోరాటాలు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా నకిలీ ఓట్లు నమోదు అవుతు న్నాయని ఎలాంటి కారణాలు లేకుండా నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందని, కానీ ఎన్నికల సంఘం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆర్టీఐ సమాచారం ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 30లక్షల మంది కొత్త ఓట్లు ఎలా నమోదయ్యాయని ప్రశ్నించారు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో ఎలాంటి రిజిస్ట్రేషన్, ఆధారాలు లేకుండా లక్ష రెండు వేల యాబై నకిలీ ఓట్లను నమోదు చేశారని ఆరోపించారు. హర్యాన రాష్ట్రంలో కూడా ఇలాగే నకిలీ ఓట్లను నమోదు చేశారన్నారు. ఆర్టీఐ ద్వారా దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా వివరాలు సేకరిస్తే సుమారు 13 కోట్ల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తేలిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, కేసీ వేణు గోపాల్ వంటి నాయకులు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నకిలీ ఓట్ల అంశంపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంద న్నారు. రాన్నున్న రోజుల్లో పల్లెలు, పట్టణాల్లో ర్యాలీలు, సమా వేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు నకిలీ ఓట్ల నమోదును కాంగ్రెస్ పార్టీ పక్షాణ తెలయజేస్తామన్నారు. ఓట్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ర్యాలీలో కమ్యూనిస్టులు, యువకులు, విద్యార్థులు, ప్రజలందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తద నంతరం బూత్‌స్థాయి నుంచి ఓటర్ల జాబితాలను తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు.
జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి..
దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా నిర్ణయాలు తీసు కుంటున్న ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, మళ్లీ బ్యాలెట్ పద్ధతిలో దేశంలో ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన డిమాండ్‌తో నవంబర్ 25,26 తేదీల్లో చలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా మన్నారు. ఆర్థికంగా సాంకేతికగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, యూకే లాంటి దేశాల్లో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈవీఎంల ద్వారా మోసం చేయవచ్చునని ఆ దేశాల ప్రజలకు తెలుసునని అందుకే అక్కడ ఈవీఎంలను ఉపయోగించడం లేదన్నారు. భారత దేశం లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే వంద శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజాగ్రహానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వికెట్ పడిపోయిందని, ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్‌కుమార్‌కు మద్దతునిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్‌షాలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశం కోసం, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడం కోసం తాము చేస్తున్న పోరాటానికి ప్రజల, మీడి యా మద్దతు అవసరమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సర్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీశైలంగౌడ్, గ్రంథాలయం జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనా రాయణ, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, వేములవాడ పట్టణ అధ్యక్షుడు తూమ్ మధు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాల రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పండుగ ప్రదీప్, మార్కెట్ కమిటి చైర్‌పర్సన్ వెలుముల స్వరూపతిరుపతిరెడ్డి, మున్సి పల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళప్రభాకర్, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వేముల వాడ పట్టణ, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.