Share News

వృథా నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:38 AM

అటవీ ప్రాంతాల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు అడుగులు పడుతున్నాయి.

వృథా నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ

రుద్రంగి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : అటవీ ప్రాంతాల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు అడుగులు పడుతున్నాయి. అడవుల్లోని వన్యప్రాణులతో పాటు రుద్రంగి గ్రామ ప్రజలకు నీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఎండల తీవ్రత పెరగడం, ఎల్‌నినో ప్రభా వంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా రుద్రంగి మండల అటవీ ప్రాంతంలో సహజ నీటి వనరు ల సంరక్షణ, చెక్‌డ్యామ్‌లు, కుంటలు, చిన్న చెరువుల పునరుద్ధరణకు ప్రణా ళికలు తయారు చేస్తున్నారు.

అటవీ ప్రాంతంలో ‘ఆది’ పర్యటన..

ఇటీవల రుద్రంగి, కోనరావుపేట మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులతో కలిసి పర్యటించారు. సీమర్లు ఒర్రె, గోలేపు లొద్ది, సూరమ్మ బుగ్గ ఒర్రె, రెండు గట్ల వాగు, బుగ్గ రాజరాజే శ్వరస్వామి చెక్‌డ్యామ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఏడాది పొడవు నా సహజసిద్ధంగా ప్రవహించే వాగులు, వంకల్లో నీటి నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. దెబ్బతిన్న సీమర్లు, సూరమ్మ బుగ్గ, బుగ్గ రాజరా జేశ్వరస్వామి చెక్‌డ్యామ్‌లను పునరుద్ధరించడంతో పాటు, వీలైనచోట్ల నీటిని నాగారం చెరువుకు మళ్లించే అవకాశాలను పరిశీలించారు. బుగ్గ రాజరాజేశ్వ ర స్వామి ఆలయ సమీపంలోని చెక్‌డ్యామ్‌లో నీటిని నిల్వ చేయడం ద్వారా సమీప గిరిజన తండాలకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని అధి కారులకు సూచించారు. వాగులు, వంకల ప్రవాహాలకు అనుగుణంగా చిన్న చిన్న నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టడం ద్వారా వర్షాకాలంలో వచ్చే నీటిని సాధ్యమైనంత మేర నిల్వ చేసుకోవచ్చని, దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడంతోపాటు రుద్రంగిలోని చెరువుల్లో నీటి లభ్యత మెరుగుపడే అవకా శం ఉందని అధికారులు గుర్తించారు. అడవిలోని నీటి వనరులను సంరక్షిం చడం ద్వారా వన్యప్రాణులు, రుద్రంగి ప్రజలకు నీటి కష్టాలు తీరనున్నాయి.

Updated Date - Nov 02 , 2026 | 12:38 AM