Share News

ప్రజలకు అండగా ప్రజాప్రభుత్వం

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:19 AM

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వంను రాష్ట్ర ప్రజలు కోరి తెచ్చుకున్నారని ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

ప్రజలకు అండగా ప్రజాప్రభుత్వం
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కులు అందిస్తున్న మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం, కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు రూ.1.12కోట్ల సహాయం అందజేత

మల్యాల, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వంను రాష్ట్ర ప్రజలు కోరి తెచ్చుకున్నారని ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. దిగువ కొండగట్టులో నవంబరు 29న జరిగిన అగ్రిప్రమాదంలో 31 మంది చిరు వ్యాపారుల దుకాణాలు కాలి బూడిద కాగ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.83.12లక్షలు, విద్యుత్‌ శాఖ నుంచి రూ.29లక్షలు కేటాయించగా రూ.1.12కోట్ల ఆర్థిక సహాయంతో పాటు డీఆర్డీఏ నుంచి రూ.10లక్షల రుణాలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చి, సీఎం రేవంత్‌రెడ్డిని తాను ఎమ్మెల్యే సత్యం కలిసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరామన్నారు. అనేక నిబంధనలు అడ్డు వచ్చిన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేశారని తెలిపారు. చిరువ్యాపారులు తమ వ్యాపారం యథావిధిగా చేసుకునేలా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటి లింగాల దేవస్థానాలను కలుపుతూ టెంపుల్‌సిటీ కారిడర్‌గా రూపకల్పన చేస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే గిరిప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

ఫ కష్టాలో ఉన్న వారికి అండగా ఉంటాం

- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టు బస్సు ప్రమాదంలో 65మంది మృతి చెందినప్పటికీ గత పాలకులు కన్నేత్తికూడా చూడలేదన్నారు. తమ ప్రభుత్వంలో అగిప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన నెలరోజుల్లోనే ఆర్థిక సహాయం అందించి కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటామని భరోసా కల్పించినట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎలాంటి ఆపద వచ్చిన ప్రజలకు అండగా ఉండేందుకు తాము ముందుంటామని తెలిపారు. కొండగట్టు అబివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ తయారీ అవుతుందని తెలిపారు. గత పాలకులు కొండగట్టు అభివృద్ధికి రూ.500కోట్లు ఇస్తామని, వంద కోట్ల జీవో జారీ చేసి వంద రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిధులు ఇవ్వకుండా శిలాఫలకాలు వేసి అభివృద్ధిగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌ను వసతి కోసం అడగాగానే నిధులు మంజూరు చేయించారన్నారు. గిరిప్రదక్షిణ కోసం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఆర్డీవో మధుసూదన్‌, డీఆర్డీవో రఘువరణ్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శన్‌, సర్పంచ్‌ దారం ఆదిరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ బత్తిని మల్లీశ్వరీశ్రీనివాస్‌గౌడ్‌, తహసీల్దార్‌ వసంత, ఎంపీడీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:20 AM