రాష్ట్రంలో హోమియోపతి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:50 PM
రాష్ట్రంలో హోమియో పతి మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోరంట్ల చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి డాక్టర్ సీహెచ్ హరికృష్ణ కోరారు. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
సుభాష్‌నగర్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హోమియో పతి మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోరంట్ల చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి డాక్టర్ సీహెచ్ హరికృష్ణ కోరారు. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయు ష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కోల్‌కతాలో జాతీయస్థాయి హోమియో పతి సంస్థను, కేరళలో ప్రాంతీయస్థాయి హోమియోపతి సంస్థ (మానసిక వ్యాధులకోసం)ను, నరేలా, న్యూఢిల్లీలో జాతీయ హోమియో పతి సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. వీటన్నింటికి ఆయుష్ మంత్రిత్వశాఖ పూర్తినిధులు సమకూరుస్తోందన్నారు. అదనంగా ఆయు ష్ మంత్రిత్వశాఖ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ద్వారా వివిధ రాష్ట్రాల్లో అనేక పరిశోధనా సంస్థలను స్థాపించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించిందన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమి ళనాడు, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్రలో కొన్ని సంస్థలు ఉన్నాయన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణలోనే ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో కేవలం ఓకే ఒక ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. రోజురోజుకు హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, పేషంట్ల సంఖ్య పెరుగుతోందన్నారు. దేశానికి కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌లో హోమియోపతి యూనివ ర్సిటీలని ఏర్పాటుచేస్తే, స్థానికవిద్యార్థులు చదువుకోవడానికి అనుకూలం గా ఉంటుందని, ఆర్థికభారం తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ఎన్ రాంబాబు, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ ఎస్.దీపక్‌బాబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ మధు వారణాసి పాల్గొన్నారు.