Share News

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:52 PM

మాజీ ముఖ్యమంత్రి, టీడీ పీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని టీడీపీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి ఆవునూరి దయాకర్‌రావు అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఘన నివాళి

సిరిసిల్ల టౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి, టీడీ పీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని టీడీపీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి ఆవునూరి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటా నికి నాయకులు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా దయాకర్‌ రావు మాట్లాడారు. తెలుగు ప్రజల కోసం పార్టీని స్థాపించి తెలుగువాడి ఆత్మగౌర వాన్ని ఎన్టీఆర్‌ చాటారని అన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలలో అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు కూడు, గూడు అందించారన్నా రు. భౌతికంగా ఎన్టీఆర్‌ మనలో లేకున్నా అందరి గుండెల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చ అంజనేయులు, ఆడెపు లక్ష్మీనారాయ ణ, దుమాల సత్యనారాయణ, బింగి వెంకటేశం, రంగు శేషచారి, జెట్టి కొము రయ్య, గుజ్జ అశోక్‌, వేముల సత్యనారాయణ, సాగ ప్రశాంత్‌ పాల్గొన్నారు.

వేములవాడ : వేములవాడ పట్టణంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షు డు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతిని టీడీపీ నాయకులు నిర్వహించా రు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ అడ్‌హక్‌ కమిటీ సభ్యు డు చింతలకోటి రామస్వామి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల లు వేసి రాజన్న భక్తులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం జీవితాంతం పనిచేసిన గొప్ప నాయ కుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మిరి యాల భాస్కర్‌, లాల శ్రీని వాస్‌, భూమలింగం, రాజు, కార్తీక్‌, అనిల్‌, మధు తదితరులు ఉన్నారు.

చందుర్తి : మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణలో మాజీ ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు లింగంపల్లి వెంకటి ఆధ్వర్యంలో జెండా గద్దె వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్ధంతిని నిర్వహించారు. మండలంలోని వెల్జీపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల రజక సంఘ అధ్యక్షుడు బొల్లారం పర్శరాం, వార్డుసభ్యులు బొల్లారం ప్రసన్నకుమార్‌, బొజ్జ శ్రీనివాస్‌, నాయకులు భార్గవ్‌రెడ్డి, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సయ్య, నారాయణ, బాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సాయికిరణ్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, దినేష్‌రెడ్డి, ఆధినాథ్‌, సుదీర్‌, అభినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:52 PM