వైభవంగా అధ్యయనోత్సవం
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:59 PM
జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది.
కరీంనగర్ కల్చరల్, జనవరి 23 : జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అధ్యయనోత్సవం జరిగింది. వసంతపంచమి కావడంతో స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సాయంత్రం పరమపదోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీవారిని దర్శించి భక్తులు పులకించిపోయారు. పారాయణాలు, భజనలు, కీర్తనలతో ఆలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీసీసీ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి తదితర నాయకులతో పాటు వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్, అర్చకులు చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యులు, చెన్నోజ్వల నాగరాజాచార్యులు, వివిధ సంస్థల కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. గోగుల ప్రసాద్ నేతృత్వంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఫ నేటి కార్యక్రమాలు
శనివారం ఉదయం 9 గంటల నుంచి అంకురార్పణలో భాగంగా పాతబజార్ గౌరీశంకరాలయం నుంచి పుట్టమన్ను తెచ్చుట, సాయంత్రం పుణ్యహవాచనం, రక్షాబంధనం, రాత్రి 6-30 గంటల నుంచి శేషవాహనసేవ, వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.