Share News

ఘనంగా విద్యా విజయోత్సవం

ABN , Publish Date - May 18 , 2026 | 12:22 AM

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా విజయోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా విద్యా విజయోత్సవం

కరీంనగర్‌ టౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా విజయోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిలను సన్మానించారు. అడిషనల్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో అశ్విని తానాజీ వాఖడే, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, ఆర్డీవో మహేశ్వర్‌ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేసి అభినందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేసిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

Updated Date - May 18 , 2026 | 12:22 AM