Share News

ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:53 PM

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతోందని మానకొం డూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయ ణ పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ప్రభుత్వం

ఇల్లంతకుంట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతోందని మానకొం డూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయ ణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వైశ్యభవ నంలో శుక్రవారం ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న నమ్మకంతో ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధా న్యమిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రం లో కొనసాగుతోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడమే కాకుండా పెట్టుబడి సాయం అందిస్తోంద న్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. అర్హులైన వారందరికి పెన్షన్లు పంపిణీ చేస్తుం దని పేర్కొన్నారు. విద్యా విధానంలో మార్పు తీసుకరావడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తు న్నాడన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేయడమే కాకుండా భవిష్యత్తులో విద్యా ర్థులు రాణించేలా ప్రణాళికలు సిద్ధం అవుతు న్నాయన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, నేడు అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందినప్పుడే అభి వృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ, మండ ల ప్రత్యేకాధికారి రామకృష్ణ, ఎంపీడీవో శశికళ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్క ర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, ఏఎం సీ చైర్‌పర్సన్‌ అంతగిరి సాహిత్యవినయ్‌కుమా ర్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీగల పుష్ప లత, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటితోపాటు పలు గ్రామా ల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండలంలోని తాళ్లపల్లి గ్రామసమీపంలోని శ్రీరాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రారంభించారు. రైతులు పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంద న్నారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకవచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడా లన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సింగిరెడ్డి రచ నావెంకటరాంరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్య క్షుడు ఎలుక రామస్వామి, మార్కెట్‌శాఖ కార్య దర్శి హరినాథ్‌, సీసీఐ అధికారి భూమేష్‌లతో పాటు వార్డుసభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:53 PM