పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:17 AM
నిరుపేదల కుటుంబాల సొంతింటి కల ను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు.
వేములవాడ రూరల్, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి) : నిరుపేదల కుటుంబాల సొంతింటి కల ను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు. వేములవాడ పట్టణంలోని 22వవార్డు, రూర ల్ మండలంలోని మల్లారం గ్రామంలో ఇందిర మ్మ ఇళ్లలో లబ్ధిదారులు, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ మాట్లా డుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మెన్ పుల్కం రాజు, వైస్ చైర్మెన్ నరాల శేఖర్, స్తానిక కౌన్సిలర్ ఇప్పపూల మమతఅజయ్, సర్పంచ్ సంగం అర్పిత, ప్యాక్స్ చైర్మెన్ వకులాభరణం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్య క్షుడు సోయినేని కరుణాకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సామ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పం చులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : నీడ లేని నిరుపేదలకు గూడు కల్పించి పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రజాపాలన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు దేవానందం, మమతలు అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో దీపావళి పండుగను పురస్కరించుకుని మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులతో కలిసి దీపాలను వెలిగించి టపాసులు పేల్చారు. లబ్ధిదారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాజేందర్, సంతోష్‌నాయక్, సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : మండలంలోని పలు గ్రామా ల్లో ఇందిరమ్మ ఇళ్ళ వద్ద దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట, ము స్కానిపేట, వల్లంపట్ల, వెల్జీపూర్, పెద్దలింగాపూ ర్ తదితర గ్రామాలలో ఆదివారం రాత్రి ఇందిర మ్మ ఇళ్ళ వద్ద కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మా మిడి రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమ టిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏఎమ్‌సీ చైర్‌పర్సన్ అంత గిరి సాహిత్యవినయ్‌కుమార్, ఎంపీడీఓ శశికళ, ఎంపీవో వాజీర్, సర్పంచులు నేరెళ్ళ విజయ్, నాయిని నవీన్‌కుమార్, గన్నారం వసంత నర్స య్య, నాయకులు పసుల వెంకటి, చిట్టి ఆనంద రెడ్డి, ఒగ్గు రమేష్, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, గుండ వెంకటేశం, రాంప్రసాద్‌రెడ్డి, మాతిరెడ్డి నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి : ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ నాయకులు దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి రోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మకాలనీలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులైన దంపతులకు నూతన వస్త్రాలను అందించి సంబరాలు జరుపుకున్నారు. జిల్లెల్లలో ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగేల రాజు, నాయకు లు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సర్ సిరిసిల్ల నియోజకవర్గ కోఆర్డి నేటర్ జాల్గం ప్రవీణ్, సర్పంచ్‌లు మోర లక్ష్మీరా జం, దుబ్బాక రజిత రమేష్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, నాయకులు ఇట్టి రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆసరి బాలరాజ్, లింగాల భూ పతి, రాపెల్లి ఆనందం, చెన్నమనేని ప్రశాంత్, ఆస సందీప్, ఎడ్ల తిరుపతి పాల్గొన్నారు.
చందుర్తి : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇంటి ఎదుట లబ్ధిదా రుల కుటుంబ సభ్యులందరితో కలిసి దీపం వెలి గించారు. ప్రజాప్రతినిధులు, గృహ నిర్మాణశాఖ అధికారులు, ఇందిరమ్మ గృహ కమిటీల సభ్యులు పూర్తయిన ఇళ్లను సందర్శించి, లబ్దిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.