Share News

నీటిని వృథా చేస్తే రూ.2 వేల జరిమానా..

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:32 AM

ఎల్‌నినో ప్రభా వంతో ఎండల తీవ్రత పెరిగి నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న దృష్ట్య తాగునీటిని పొదుపుగా విని యోగించుకోవాలని, ప్రతి ఇంటి యజమాని తమ కుళా యి కనెక్షన్‌కు తప్పనిసరిగా ఆన్‌ ఆఫ్‌ వాల్‌ ఏర్పాటు చేసుకోకుండా నీటిని వృథా చేస్తే ఇంటి యజమానులకు రూ 2 వేలు జరిమానా విధించడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

నీటిని వృథా చేస్తే రూ.2 వేల జరిమానా..

సిరిసిల్ల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభా వంతో ఎండల తీవ్రత పెరిగి నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న దృష్ట్య తాగునీటిని పొదుపుగా విని యోగించుకోవాలని, ప్రతి ఇంటి యజమాని తమ కుళా యి కనెక్షన్‌కు తప్పనిసరిగా ఆన్‌ ఆఫ్‌ వాల్‌ ఏర్పాటు చేసుకోకుండా నీటిని వృథా చేస్తే ఇంటి యజమానులకు రూ 2 వేలు జరిమానా విధించడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సిరి సిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌, అధికారులు దేశ ఐక్యత, సమ గ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. శనివా రం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అధ్యక్ష తన సిరిసిల్ల మున్సిపల్‌ సాధారణ సమావేశం జరి గింది. 21 అంశాలతో కూడిన ఎజెండాపై కౌన్సిలర్లు చర్చలు జరిపి ఆమోదం తెలిపారు. నీటి వృఽథాను అరిక ట్టడానికి మున్సిపల్‌ నిబంధన ప్రకారం జరిమానాలు వేయాలని ఆమోదం తెలుపుతూ యజమానులందరూ మున్సిపల్‌ నల్ల కనెక్షన్లకు ఆన్‌ఆఫ్‌ వాల్స్‌ ఏర్పాటు చేసు కోవాలని సూచించారు. సిరిసిల్లలో కోతుల బెడదను నివారించడానికి ఒక కోతిని పట్టుకొని మహారాష్ట్ర సరి హద్దు సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టడానికి ఒక కోతికి రూ.850 చొప్పున 200కోతులు తరలించడా నికి రూ.1.70 లక్షలు కేటాయించారు. శానిటేషన్‌ నిర్వ హణ కోసం నాలుగు ట్రాక్టర్లు, నీటి సరఫరా కోసం ట్యాంకర్ల కొనుగోలు కోసం రూ 55 లక్షలు 15 ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ నిధులను మంజూరు చేశారు. సిరిసిల్లలోని వివిధ వార్డులో రూ 29 లక్షలతో మురికి కాలువ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం ఇతర పనులు చేపట్టడానికి మంజూరు చేశారు. సిరిసిల్లలోని గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి తడి, పొడి, హానికర వ్యర్థాలను సేకరించడానికి నాలుగు రకాల డస్ట్‌ బిన్లను పంపిణీ చేయడం కోసం కొనుగోలుకు రూ.12.50 లక్షలు కేటాయించారు. సర్దాపూర్‌లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం రూ 12 లక్షలు మంజూరు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, కమిషనర్‌ ఖదీర్‌ పాషా, కౌన్సిలర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:32 AM